సంయుక్త కిసాన్ మోర్చా (SKM ), సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర ఫెడరేషన్లు, సంఘాలు కలిసి ఇచ్చిన 16 వ తేదీ భారత్ బంద్, పారిశ్రామిక , సెక్టోరల్ సమ్మెను ఆహార సార్వభౌమాధికార వేదిక మద్దతును తెలియ చేస్తున్నది.
ఈ సమ్మెలో భాగంగా మేము తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మా సభ్యులున్న గ్రామాలలో రైతు ఉద్యమానికి మద్దతుగా చర్చలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కార్పొరేట్ ఆదిపత్యానికి వ్యతిరేకంగా , ప్రజాస్వామిక హక్కుల పునరుద్దరణకు, లౌకిక స్ఫూర్తి కాపాడాటానికి వివిధ కార్యక్రమాలను రైతులు, కూలీలతో నిర్వఫిస్తున్నాము.
పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రైతుల చలో ఢిల్లీ కార్యక్రమంపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని, అణిచివేతను మేము ఖండిస్తున్నాము. భావప్రకటన స్వేచ్చా హక్కులపై నిర్బంధాన్ని నిరసిస్తున్నాము. పోరాడే రైతులకు మా పూర్తి సంఘీభావాన్ని తెలియచేస్తున్నాము. రైతు ఉద్యమాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి !
న్యాయం లేనిదే శాంతి లేదు!!
జై భూతల్లి జై ఆదివాసీ జై భీం
The Food Sovereignty Alliance extends its support to the Grameen Bharat Bandh and Industrial / Sectoral Strike on 16th February 2024, a call given by the Samyukta Kisan Morcha (SKM) and the Joint Platform of Central Trade Unions, Independent/Sectoral Federations, Associations.
Our actions today, in our villages and communities in districts of Telangana and Andhra Pradesh, advances our struggle against aggressive State supported corporate hegemony and loot, and asserts our commitment to protect democratic rights, our constitutional values, and secular polity.
Our protest today also reflects our condemnation of the repression of people’s movements including the current repression and violence being unleashed by the Central and Haryana state government against farmers from Punjab, blocking them from entering Delhi. We extend our solidarity to the farmers who are asserting their constitutional right to expression, movement and assembly.
Power to the People !
No Peace without Justice !
Jai Bhuthalli ! Jai Adivasi ! Jai Bhim